హైదరాబాద్, (సిరా న్యూస్)
సీఎం కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో నగరం అన్ని విధాలుగా అభివృద్ధి చెందిందని బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేష్ అన్నారు. గోల్నాక డివిజన్లోని తులసి రామ్ నగర్ లంక, లక్ష్మీ నగర్ తదితర ప్రాంతాలలో కాలేరు వెంకటేష్ తన ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఇంటింటికి తిరిగి కెసిఆర్ ప్రకటించిన మేనిఫెస్టోను అందజేస్తూ కారు గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఎక్కడికి వెళ్లినా ప్రజలు తనకు బ్రహ్మరథం పడుతున్నారని చెప్పారు. పూలు చల్లి, హారతులు పట్టి స్వాగతిస్తున్నారని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపిస్తామని తెలిపారు.