సిరా న్యూస్, సోనాల:
దేశం కోసం, ధర్మం కోసం పనిచేసే నిబద్దతగల బీజేపీ పార్టీతోనే అభివృద్ధి సాధ్యమని బోథ్ నియోజక వర్గ ఎమ్మెల్యే అభ్యర్థి సోయం బాపూరావ్ అన్నారు. ఆయన సోనాల మండలంలోని వజ్జార్, లోనిలెండి గూడ, మహదుగూడ, కేశవ్ గూడ, చింతల్ బోరి, గొల్లాపూర్, తదితర గ్రామాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు ఆయనుకు డప్పువాయిద్యాలు, మంగళ హారతులతో ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సోయం బాపూరావ్ మాట్లాడుతూ.. తెలంగాణలో డబుల్ ఇంజీన్ సర్కార్ అవసరం ఉందన్నారు. ప్రజలంత కమలం పువ్వు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమనీ, ప్రజలంత బీజేపీ వైపే ఉన్నారని అన్నారు.