జిల్లాలోని మాదిగలు అందరూ కమలం గుర్తుకే ఓటు వేయాలని విజ్ఞప్తి
కనక ప్రమోద్ మాదిగ
నిజామాబాద్,(సిరా న్యూస్);
ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు జిల్లాలోని ఎమ్మార్పీఎస్ , ఎంఎస్పి , విహెచ్పిఎస్ , ఎంఎంఎస్ , ప్రజాస్వామిక వాదులు అందరూ బీజేపీకి అండగా నిలబడి కమలం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.
ఈ పత్రిక సమావేశంలో ఎమ్మార్పీఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కనక ప్రమోద్ మాదిగ మాట్లాడుతూ” 75 యేండ్ల మాదిగల కల, 30 యేండ్ల ప్రత్యక్ష మాదిగల ఉద్యమ కల అయిన వర్గీకరణ బీజేపీ ఆధ్వర్యంలో నెరవేరబోతుందాని, ఈ విషయాన్ని జిల్లాలోని మాదిగలు అందరూ గమనించాలని విజ్ఞప్తి చెయ్యడం జరిగింది.
ఈ నెల 11 నాడు లక్షలాది మందితో జరిగిన మాదిగల విశ్వరూప మహాసభకు భారత దేశ ప్రధాని గౌ. నరేంద్ర మోడీ గారు వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అలాగే ఈ నెల 18 నాడు జరిగిన ఎమ్మార్పీఎస్ అనుబంధ సంఘాల జాతీయ సమావేశానికి భారత్ దేశ హోమ్ శాఖ మత్యులు గౌ. అమిత్ షా గారు కూడా రావడం జరిగింది. ఈ సమావేశాలలో మనకు భారత దేశ అత్త్యుత్తమ నాయకులు ఇద్దరు మన లక్ష్యం అయిన వర్గీకరణ మీద స్పష్టమైన వైఖరి తెలియచేయడం జరిగింది. ఈ వచ్చే పార్లమెంట్ సమావేశాలలో వర్గీకరణ బిల్లు పేట్టి చట్టబద్ధత కల్పిస్తామని హామీ ఇవ్వడం జరిగింది.
మంద కృష్ణ మాదిగ గారి నాయకత్వంలో మాదిగలు గత 30 ఏండ్లుగా మాదిగల భవిష్యత్తు కోసం ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఉద్యమం జరుగుతుందని, ఇప్పుడు ఆ ఉద్యమం చివరి మెట్టు మీద ఉందాని తెలియచేయడం జరిగింది.
వర్గీకరణ విషయంలో కాంగ్రెస్, భారాస పార్టీలు మాదిగలను అత్యంత ఘోరంగా మోసం చేశాయని, ఆ రెండు పార్టీలకు మాదిగలు అస్సలు ఓట్లు వెయ్యద్దోని పిలుపునివ్వడం జరిగింది. మాదిగల భవిష్యత్తు కోసం మంద కృష్ణ మాదిగ గారు తప్ప ఏ నాయకుడు ఆలోచించలేదాని, ఆయన ఏ పార్టీ వ్యక్తిని కాదని, గత 30 ఏండ్లుగా మాదిగల భవిష్యత్తు కోసం మాత్రమే పోరాడుతున్నాడని, ఆయన వొంటి మీద నల్ల ఖండువా మారిన చరిత్ర లేదని, భవిష్యత్తులో కూడా మారదని తెలియచేయడం జరిగింది. ఆయన లక్ష్యం మాదిగల భవిష్యత్తు అని, ఆయన చివరి అంకం వరకు మాదిగ, సబ్బండ కులాల హక్కుల కోసమే పోరాడుతాడాని తెలియచేయడం జరిగింది.