.
లింగాల – అంబట్ పల్లి లో కార్ ప్రచారం ..
పి ఏ సీ ఎస్ చెర్మేన్ జంబుల హన్మంతు రెడ్డి
నాగర్ కర్నూల్, (సిరా న్యూస్);
బీ అర్ ఎస్ గెలుపు ను ఎవరు ఆపలేరు అని బీ ఆర్ ఎస్ సీనియర్ నాయకులు పి ఏ సీ ఎస్ చెర్మేన్ జంబుల హన్మంతు రెడ్డి అన్నారు. లింగాల మండల పరిధిలోని అంబట్ పల్లి లో కార్ ప్రచారం ముమ్మరంగా చేపట్టారు. ఎమ్మెల్యే గువ్వల బాలరాజు ను భారీ మెజార్టీ తో గెలిపించాలని ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. బీ అర్ ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి నీ చూసి ఓటు వేయాలని కోరారు. అచ్చంపేట నియోజక వర్గంలో ప్రతి గ్రామానికీ సాగు నీరు, త్రాగు నీరు, ఇచ్చిన ఘనత ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అని గుర్తు చేశారు. పేదలకు వృథలకు,వితంతువులకు, వంటారి మహిళలకూ.పెన్షన్ 2016,వికలాంగులకు 4016 ,ఇచ్చింది సీఎం కేసీఆర్ అని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 24 గంటలు కరెంట్ ఇస్తుంటే, కాంగ్రెస్ పార్టీ 3 గంటలు కరెంట్ రైతులకు సరిపోతుందని అన్నడం పై ప్రశ్నిచారు. తెలంగాణా రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ ఏంతో పోరాటం చేసి తెలంగాణా రాష్ట్ర సాధించుకున్న అనంతరం మహబూబ్నగర్ జిల్లాలో కలిసి ఉన్నా నాగర్ కర్నూల్ ను సపరేటు చేసి జిల్లా ఏర్పాటు కు కృషి చేశారని అన్నారు. కల్వకుర్తి ఎత్తిపోతల పథకం ద్వారా సాగునీరు రైతులకు అదిస్తున్న ఘనత సీఎం కెసిఆర్ అని గుర్తు చేశారు. కాంగ్రెస్ మాయమాటలు నమ్మరదని ప్రజలకూ పిలుపునిచరూ.