బూడిదను ఆమ్ముకునే బీఆర్ఎస్ కు బుద్ధి చెప్పాలి. రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్….

గోదావరిఖని,(సిరా న్యూస్);
బూడిద దోపిడీ చేసి రామ గుండాన్ని రావణ కాష్టంగా తీర్చిదిద్దిన బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని రామగుండం కాంగ్రెస్ అభ్యర్థి రాజ్ ఠాకూర్ అన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా గోదావరిఖని, సింగరేణిఎస్ అండ్ పిసి సిబ్బందిని రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ కలిసి ఓట్లను అభ్యర్థించారు.ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వంమాయ మాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని దోపిడీ పాలన చేస్తున్న బీఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు. ఉద్యోగాలు లేక యువకులు ఆత్మహత్యలు చేసుకుంటున్నరాని తెలిపారు.ఈకార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు పాల్గొన్నారు.వాకర్స్ ను కలిసిన రాజ్ ఠాకూర్గోదావరిఖని: పిజి కాలేజీ గ్రౌండ్ లో సోమవారం ఉదయం రామగండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ వాకర్స్ ను కలిసి చేతి గుర్తుకు ఓటు వేసి నాకు ఒక్కఅవకాశం ఇవ్వాలని కోరారు.వీరి వెంట కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ విభాగాల అధ్యక్షులు ఉన్నారు.
కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్లు
గోదావరిఖని-: ప్రైవేట్ ఎలక్ట్రిషన్లు సోమవారం రామగండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పార్టీలో చేరారు. ఈ ప్రాంతంలోదోపిడీ పాలన జరుగుతుందాని, మాయ మాటలతో మోసం చేసే బిఆర్ఎస్ పార్టీకి బుద్ధి చెప్పాలని అన్నారు. ప్రజా హితం కోరే కాంగ్రెస్ పార్టీకీ అవకాశం ఇవ్వాలని కోరారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీనాయకులు, కార్పొరేటర్లు, తదితరులు పాల్గొన్నారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *