బెల్లయ్య నాయక్ కు శుభాకాంక్షలు తెలిపిన గోవింద్ నాయక్ ..

సిరా న్యూస్, నిర్మల్:

బెల్లయ్య నాయక్ కు శుభాకాంక్షలు తెలిపిన గోవింద్ నాయక్     

రాష్ట్ర గిరిజన కో ఆపరేటివ్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించబడిన డాక్టర్ తేజవత్ బెల్లయ్య నాయక్ కు నిర్మల్ జిల్లా ఎస్టీ సెల్ అధ్యక్షులు బాణావత్ గోవింద్ నాయక్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన పత్రిక ప్రకటన విడుదల చేశారు. తేజవత్ బెల్లయ్య నాయక్ ను చైర్మన్ గా నియమించినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎల్ హెచ్ పి ఎస్ వ్యవస్థాపకులు బెల్లయ్య నాయక్ జీవితంలో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలనీ కోరారు. ఆయన వెంట ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాదవ్ అశోక్ నాయక్, నాయకులు గుగ్లోత్ గంగాధర్ నాయక్, డాక్టర్ బాపూరావు, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *