బాధితులను ఆదుకోవాలని సీఎం ఆదేశం
విశాఖపట్నం, (సిరా న్యూస్);
విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్లో మత్స్యకారుల బోట్లు దగ్ధమైన ఘటనపై సీఎం వైయస్.జగన్ మోమన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనపై లోతైన దర్యాప్తు జరిపి కారణాలు వెలికి తీయాలని ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని ఆదేశించారు. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండాలని, తగిన విధంగా వారికి సహాయం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.
మరోవైపు, .ఫిషింగ్ హార్బర్ వద్ద మస్ట్యకారుల కుటుంబాలు ఆందోళనకు దిగాయి. తమకు వెంటనే నష్టపరిహారం అందించాలని డిమాండ్ చేసాయి. సంఘటన స్థలానికి ముఖ్యమంత్రి చేరుకొని ఘటనా తీరు పరిశీలించాలని తమకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేసాయి. పోలీసులు అగ్నిప్రమాదం ఫై విచారణ వేగవంతం చేసారు. అగ్ని ప్రమాదానికి కారణమని భావిస్తున్న ఓ వ్యక్తి కోసం గాలిస్తున్నారు.