బ్రహ్మోత్సవాలకు ముస్తాబైన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం...
సిరా జైనథ్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి 18 కిలోమీటర్ల దూరంలో ఉన్న మండల కేంద్రంలో జైనథ్లో గల అతి ప్రాచీన ఆలయం శ్రీ లక్ష్మీ నారాయణ స్వామి ఆలయం. ఈనెల 23వ తేదీ నుంచి నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలకు ఆలయం ముస్తాబవుతుంది. కార్తీక శుద్ధ ద్వాదశి కల్యాణోత్సవం మొదలు కార్తీక బహుళ పంచమి వరకు ఈ బ్రహ్మోత్సవాలు కొనసాగుతాయి. ఐదు రోజులపాటు జరిగే జాతరకు ఉమ్మడి జిల్లాతో పాటు మహారాష్ట్ర నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. జిల్లాలో శ్రీమన్నారాయణ ఇష్ట దైవంగా కొలుస్తారు. కోరిన వరాలు ఇచ్చే సత్యనారాయణగా ఆరోగ్యాన్ని అధిపతి అయిన సూర్యనారాయణ గా సంతాన సౌభాగ్యం ప్రసాదించే లక్ష్మీనారాయణ భక్తులు కొలుస్తారు. ఏడాదికి రెండుసార్లు స్వామివారి పాదాలను సూర్యకిరణాలు తాకుతుంటాయి. స్వామి వారి కళ్యాణం రథోత్సవాలు నిర్వహించేందుకు ఆలయ అధికారులు అని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుత్ దీపాలతో సిద్ధం చేశారు. డిసెంబర్ ఒకటో తేదీన జరిగే జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు వచ్చే అవకాశం ఉందన్న అన్ని ఏర్పాటు చేసినట్టు ఆలయ సిబ్బంది పేర్కొన్నారు.