సిరా న్యూస్,;
ఈనెల 30 తేదీన అవుకు రెండవ టన్నల్ ను రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ ప్రారంభోత్సవ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ రఘువీర్ రెడ్డి అవుకు టన్నెల్ నుండి 600 మీటర్ల దూరంలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ ను పరిశీలించి తీసుకోవలసిన భద్రత చర్యలపై కొన్ని సూచనలు చేశారు. హెలిప్యాడ్ నుండి అవుకు టన్నెల్ వరకు వున్న రహదారివెంట బందోబస్తు సిబ్బందిని నియమించాలని, హెలిప్యాడ్ వలయం చుట్టూ ఐరన్ బాడికేడింగుల వద్ద పకడ్బందీగా బందోబస్తు ఏర్పాటు చెయ్యాలని, అవుకు టన్నెల్ వద్ద గల రోడ్డు కిరివైపులా బారికేడింగు వద్ద మరియు టన్నెల్ ఫొటోస్ ప్రదర్శన వద్ద పటిష్ట భద్రత చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ తో పాటు డోన్ DSP శ్రీనివాస్ రెడ్డి , స్పెషల్ బ్రాంచ్ DSP సంతోష్ ,ఇంటెలిజెన్స్ డిఎస్పి గోపాలకృష్ణ ,ఆర్ అండ్ బి ఎస్.ఈ శ్రీధర్ రెడ్డి , మ్యాక్స్ ఇన్ఫ్రా లిమిటెడ్ జనరల్ మేనేజర్ శ్రీహరి , రూరల్ వాటర్ సప్లై ఎస్ .ఈ మనోహర్ , ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ A.E పక్కిరయ్య ,స్పెషల్ బ్రాంచ్ సిఐ సుర్యమౌలి ,బనగానపల్లి సిఐ తిమ్మారెడ్డి , ఆవుకు SI విష్ణు నారాయణ పాల్గొన్నారు.