(సిరా న్యూస్);
-నేడు ఆయన వర్ధంతి
భారతదేశపు ప్రముఖ పారిశ్రామికవేత్త, తొలి విమాన చోదకుడు, ఎయిర్ ఇండియా వ్యవస్థాపకుడు, టాటా గ్రూప్ ఛైర్మన్ జహంగీర్ రతన్ జీ దాదాభాయి టాటా, ఈయనకు 1992లో భారతరత్న పురస్కారాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్యారిస్ లో జన్మించిన ఈయనను “జెహ్” లేక “జేఆర్డీ”గా సంబోధిస్తారు. ఈయన తల్లి ఫ్రాన్సు దేశస్థురాలు కావడంతో, ఈయన ఫ్రెంచి భాషను మొదటి భాషగా నేర్చుకున్నాడు. 1929లో ఈయన భారతదేశములోనే మొట్టమొదటి పైలట్ లైసెన్సు పొందాడు. 1932 లో ఈయన భారతదేశపు తొలి వాణిజ్య విమానసేవలను టాటా ఎయిర్ లైన్స్ పేరుతో ప్రవేశపెట్టాడు. 1946లో అది “ఎయిర్ ఇండియా”గా రూపాంతరం చెందింది. తర్వాతికాలంలో ఆయన భారతదేశపు పౌరవిమానయాన పితామహుడుగా ప్రశంసింపబడ్డాడు.34 ఏళ్ళ వయసులో ఆయన టాటా వ్యాపారసంస్థలకు పెట్టుబడిదారీ సంస్థ హోల్డింగ్ కంపెనీ లేక మాతృసంస్థ అయిన టాటా సన్స్ సంస్థకు చైర్మనుగా బాధ్యతలు చేపట్టి 1991 వరకు ఆ పదవిలో కొనసాగాడు. సుదీర్ఘమైన ఆయన హయాంలో టాటా గ్రూపు ఆస్తులు అరవైరెండు కోట్ల రూపాయల నుండి పదివేల కోట్ల రూపాయల పైబడి పెరగగా, గ్రూపులో సంస్థలు పదిహేను నుండి నూటికి పైగా చేరుకున్నాయి.జహంగీర్ రతన్‌జీ దాదాభాయి టాటా ఫ్రాన్స్ లోని ప్యారిస్‌లో రతన్‌జీ దాదాభాయి టాటాకు ఆయన ఫ్రెంచ్ సతీయణి అయిన సుజానె బ్రెయిర్‌కూ రెండో బిడ్డగా 1904 జూలై 29 లో జన్మించాడు. ఆయన తండ్రి భారతదేశంలో తొలి పారిశ్రామికవేత్త అయిన జెంషెట్‌జీ టాటాకు దాయాది సోదరుడు. టాటా ఫ్రాన్స్‌లోని బీచ్‌బడ్డున ఉన్న హార్డెలోట్‌లో తన బాల్యాన్ని గడిపినప్పుడు, ఆయనకు విమానయానం పైన ఆసక్తి ఏర్పడింది. విమానాలు నడపడంలో ఆద్యుడైన లూయీ బ్లెరియో నుండి ఆయన స్ఫూర్తి పొందాడు.1929 లో టాటా భారతదేశంలో మొట్టమొదట పైలట్ లైసెన్సు పొందాడు. తర్వాతి కాలంలో ఆయన భారత పౌర విమానయాన పితగా గుర్తింపు పొందాడు. భారతదేశంలో మొట్టమొదటి వాణిజ్య విమానయాన సంస్ధ టాటా ఎయిర్ లైన్స్‌ను 1932 లో స్ధాపించాడు. అదే తర్వాత 1946 లో ఎయిర్ ఇండియాగా మారింది.ఆయన తల్లి ఫ్రెంచ్ దేశానికి చెందినవారవటం వల్ల ఆయన తన బాల్యాన్ని ఎక్కువగా ఫ్రాన్స్‌లోనే గడిపాడు. అతను నేర్చుకున్న మొదటి భాష ఫ్రెంచ్. ఆయనకు ఎన్నో ఇష్టాలుండేవి. కేంబ్రిడ్జ్‌లో చదువుకోవాలనుకున్నాడు. వేగంగా వేళ్లే కార్లపై మోజు పడేవాడు, ఫ్రెంచ్ సైన్యంలో లా సఫిస్ (సిపాయిు) అనే రెజిమెంట్‌లో పనిచేశాడు. ముంబయిలోని కాథెడ్రల్, జాన్‌కానన్ పాఠశాల్లో చదువుకున్నాడు.