కరీంనగర్ పై పూర్తి అవగాహనే లేని వ్యక్తి కాంగ్రెస్ అభ్యర్ధి
లక్ష ఫోన్లు, ఓటుకు రూ.10 వేలును నమ్ముకున్న గంగుల
మీ సమస్యలపై పోరాడి జైలుకు పోయిన చరిత్ర నాది
మీరు ఓట్లు వేయకుంటే పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజవేస్తారు
గంగుల లక్ష సెల్ ఫోన్ల, ఓటుకు రూ.10 వేలను నమ్ముకున్నడు
ఓటుతో బీఆర్ఎస్, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ది చెప్పండి
బీజేపీ కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ పిలుపు
కరీంనగర్ వచ్చి అభివ్రుద్ధి గురించి కేసీఆర్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్న
‘కరీంనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్ధికి భూకబ్జాలు తప్ప తెలుసు? అసలు ఆయనకు కరీంనగర్ పైన అవగాహనే లేదు. ఆయనతోపాటు బీఆర్ఎస్ అభ్యర్ధి గంగుల కమలాకర్ ఏ ఒక్కరోజైనా కరీంనగర్ ప్రజల కోసం పోరాటాలు చేశారా? ఏన్నడైనా జైలుకు పోయారా?’’అంటూ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ ప్రశ్నించారు. తాను నిరంతరం ప్రజల కోసం పోరాడానని, నిరుద్యోగులు, ఉద్యోగులు, రైతులు, మహిళలుసహా అన్ని వర్గాల ప్రజల పక్షాన పోరాడి జైలుకు వెళ్లానని చెప్పారు. తాను ప్రజల కోసం కొట్లాడితే… తనకు కేసీఆర్ ఇచ్చిన గిఫ్ట 74 కేసులని అన్నారు. ప్రజల కోసం తన కుటుంబాన్ని కూడా పక్కకుపెట్టి పోరాడానని, ఏనాడూ భార్యాపిల్లలకు పూర్తి సమయం కేటాయించలేదని చెప్పారు. ప్రజల కోసం, ధర్మం కోసం పోరాడేవారిని గెలిపించకపోతే… ఇకపై పేదల పక్షాన పోరాడేవాళ్లు వెనుకంజ వేసే ప్రమాదముందని హెచ్చరించారు. ఎన్నికల్లో భాగంగా ఈరోజు కమాన్ పూర్ గ్రామంలో ప్రచారం చేసిన బండి సంజయ్ కు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి బండి సంజయ్ చేసిన ప్రసంగంలోని ముఖ్యాంశాలు…
నిన్న కేసీఆర్…. కరీంనగర్ వచ్చి ఏం మాట్లాడిండు… 10 ఏళ్లలో ఏం చేసిండో చెప్పిండా? ఏమీ లేదు… నాకు మతపిచ్చి అట… ఒకసారేమో నా తల ఆరు ముక్కలు చేస్తనంటడు… ఆయనకు నేను చెప్దొక్కటే…..పేదలకు రేషన్ కార్డులిచ్చి నా తలనరుకు… పేదలకు ఇండ్లు కట్టించి ఇవ్వు నా తల నరుక్కుంటా. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు, నిరుద్యోగ భ్రుతి ఇవ్వు.. నా తల నరుక్కుంటా… పోనీ పంట నష్ట పరిహారం, కౌలు రైతులకు రైతు బంధు ఇవ్వు.. నా తల నరుక్కుంటా…భరిస్తా…