బీజేపీ అభ్యర్ది బంధువు ఇంటిపై పోలీసుల దాడి
అడ్డుకున్న బీజేపీ శ్రేణులు..ఘర్షణ
సిరా న్యూస్,నిర్మల్;
నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో అర్థ రాత్రి ఉద్రిక్తత చోటుచేసుకుంది.ముధోల్ బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ బంధువు ఇంటిలో సమాచారం మేరకు ఎఫ్ఎస్టీ టీమ్ తో పోలీసుల సోదాలు నిర్వహించారు.సోదాలు చేస్తున్న సమయంలో పోలీసులు, బీజేపీ మధ్య ఘర్షణలో పలువురు పోలీసులకు , కార్యకర్తలకు గాయాలు అయినాయి.పలు కార్ల అద్దాలు కూడా ద్వంసం అయినాయి.బీజేపీకార్యకర్తలనుచెదరగొట్టి పలువురుని అదుపులోకి పోలీసులు తీసుకున్నారు. ఇంటిలో మహిళలు మాట్లాడుతూ తాము పడుకున్న సమయంలో అర్ధరాత్రి పోలీసులు తమ ఇంటి గేటు దూకి లోపలికి వచ్చరని,వచ్చేదుంటేబెల్ కొట్టి వస్తే బాగుండేదని,సివిల్ డ్రెస్ లో,మొఖనికి మస్కులు ధరించి ఉన్నారని,తము భయపడి మా బంధువులకు సమాచారం ఇచ్చామని అన్నారు.పోలీసులు మాట్లాడుతూ fst టీమ్ సోదాలకు రావడంతో బందోబస్తుగా పోలీసులు రావడం జరిగిందని,పోలీసులపై బీజేపీ కార్యకర్తలు చేయి చేసుకొని కాలర్ పట్టుకున్నారుని,తమ పోలీసులకుగాయాలు అయినాయని, 144 సెక్షన్ అమలులో ఉన్నపుడు 50మంది వరకు ఒకే చోట ఎందుకు ఉన్నారని అందరిపై కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు.