అధిక లోడ్ తో వెళ్తున్న లారీలు సీజ్
సిరా న్యూస్,ములుగు;
మేడారం జాతర నేపథ్యంలో అధిక లోడ్ తో వెళ్తున్న ఇసుకలారీల వల్ల జాతరపనులకు ఇసుక లారీలు ఆటంకంగా మారాయి. ఓవర్ లోడ్ వల్ల రోడ్లు పాడైపోయి ప్రమాదాలు జరుగుతున్నాయని పిర్యాదులు అందాయి. ఓవర్ లోడ్ ఇసుక లారీలపై చర్యలు తీసుకోవాలని పోలీసులు, రవాణా శాఖ అధికారులను మంత్రి సీతక్క ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపధ్యంలో పోలీసులు లారీలపై కొరడా ఝులిపించారు. వెంకటాపురం, మంగపేట, ఏటూరు నాగారం మండలాల్లో ఓవర్ లోడ్ తో వెళ్తున్న ఇసుక లారీలను సీజ్ చేసారు.