గుంటూరు, (సిరా న్యూస్);
రానున్న ఎన్నికల్లో మద్యం, ఇసుక, కరెంటు చార్జీలే అజెండా అవుతాయా..? ప్రస్తుతం విపక్షాలన్నీ ఈ మూడు అంశాలపైనే దృష్టి సారిస్తున్నట్లు కనిపిస్తోంది. గత ఎన్నికల ముందు దశల వారీ మద్య నిషేధం అమలు చేస్తామని వైసీపీ హామీనిచ్చింది. అధికారానికి వచ్చాక ప్రభుత్వమే మద్యం వ్యాపారం మొదలు పెట్టింది. హామీని గాలికి వదిలేసింది. టీడీపీ హయాంలో ఉచితంగా లభించిన ఇసుక ఇప్పుడు మరింత ప్రియమైంది. భవన నిర్మాణ రంగం కుదేలైంది. ఇక నిరంతరం పెరుగుతున్న కరెంటు చార్జీలు ప్రజలను బెంబేలెత్తిస్తున్నాయి. అందుకే ఈ మూడు అంశాలను ఎన్నికల్లో అజెండా చేసేందుకు ప్రతిపక్షాలు కసరత్తు చేస్తున్నాయి. వీటిపై అధికార పార్టీ దీటుగా సమాధానం చెప్పగలదా! ఢిఫెన్స్‌లో పడుతుందా అనేది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.నాడు ప్రజా సంకల్పయాత్రలో వైసీపీ అధినేత వైఎస్జగన్దశలవారీ మద్య నిషేధం అమలు చేస్తామని హామీనిచ్చారు. పేద కుటుంబాలు గుల్లవుతుంది మద్యంతోనే అని చెప్పుకొచ్చారు. మహిళల తాళిబొట్లు తెంచుతున్న మద్యం మహమ్మారి అంతు చూస్తామన్నారు. మద్యాన్ని కేవలం స్టార్ హోటళ్లకే పరిమితం చేస్తామన్నారు