(సిరా న్యూస్); ప్రపంచ దేశాలను వణికించేందుకు మరో కొత్త వైరస్ రాబోతోంది. కరోనా మహమ్మారి పురుడుపోసుకున్న చైనా దేశంలోనే ఇది గుర్తించబడడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. అంతుచిక్కని నిమోనియా వ్యాధితో స్కూలు విద్యార్థులు పదుల సంఖ్యలో ఆస్పత్రిపాలవుతుండడంతో దీని తీవ్రతపై వైద్యులు అంచనా వేయలేకపోతున్నారు. ఈ వ్యాధి కారణంగా ఇప్పటికే బీజింగ్, లియోనింగ్ సిటీల్లోని ఆస్పత్రులు బాధితల విధ్యార్థుల తల్లిదండ్రుల ఆర్తనాదాలతో భయానకంగా దర్శనమిస్తున్నాయి. అక్కడి తాజా పరిస్థితులు కరోనా మిగిల్చిన చేతు జ్ఞాపకాలను, భయాలను పునరావృతం చేసేలా ఉన్నాయని స్థానికులు భయాందోళన చెందుతున్నారు. ఈ మిస్టరీ నిమోనియా అది వేగంగా వ్యాపిస్తుండటంతో స్కూళ్ల మూసివేత తప్పదని ఇప్పటికే స్థానిక మీడియా కథనాలు ప్రచురించాయి. 2019లో ప్రపంచం మొత్తాన్ని కరోనా గడగడలాడించింది.
కోవిడ్ పేరు చెబితే చాలు.. అప్పటి పరిస్థితులు కళ్ల ముందు కనబడుతుంటాయి. ఎక్కడ చూసినా లాక్‌డౌన్, బయటకు వెళ్లాలంటే ఆంక్షలు.. మాస్క్ లేకుండా బయటకు వెళ్లలేని పరిస్థితి. కుటుంబ సభ్యులతో కూడా సాధారణంగా పక్కనే ఉండలేని పరిస్థితి. ఇక ఆస్పత్రుల్లో భయానక దృశ్యాలు, ఆక్సిజన్ అందక వేలాది మంది మృత్యువాత.. కరోనా మృతులతో మార్చురీలు కూడా సరిపోక గదుల్లో గుట్టలు గుట్టలుగా మృతదేహాలు. స్మశానాలన్నీ హౌస్‌ఫుల్ బోర్డులు పెట్టినంత దృశ్యాలు. అలాంటి వాతావరణం నుంచి బయటపడడానికి కొన్ని నెలల సమయం పట్టింది. అంతా సర్దుకుంది అనుకుంటుండగా ఇప్పుడు దేశంలో అలాంటి వైరస్ మళ్లీ భయపెడుతోంది.తమిళనాడులో బయటపడ్డ కొత్త వైరస్ ఆందోళనను పెంచుతోంది. ఆ వైరస్‌ను ప్రస్తుతం ‘ఫ్లూ వైరస్’గా పిలుస్తున్నారు. వేగంగా విజృంభిస్తున్న వైరస్ ప్రభావంతో జనం ఆస్పత్రులకు పరుగులు తీస్తున్నారు. దీంతో అప్రమత్తమైన తమిళనాడు సర్కార్.. మాస్క్ లేకుండా ఎవరు బయటికి రావద్దని ఆదేశాలు జారీ చేసింది. కోయింబత్తుర్ జిల్లాలో ఈ తరహా కేసులు ఎక్కువగా ఉండడంతో.. ఆ జిల్లావ్యాప్తంగా అలెర్ట్ జారీ చేసిన కలెక్టర్.. పక్క జిల్లాల కలెక్టర్లను కూడా అప్రమత్తం చేశారు. ప్రభుత్వాస్పత్రులతో పాటు ప్రయివేటు ఆస్పత్రుల్లో కూడా ఈ ఫ్లూ వైరస్ కేసులు నమోదవుతున్నాయి.ముందుగా జ్వరం వస్తోంది. ఆ తర్వాత ఒళ్లునొప్పులు.. ఈ రెండు లక్షణాలు మలేరియా, టైఫాయిడ్ లక్షణాలే అనుకుని వైద్యులు కూడా అదే తరహా చికిత్స చేయడం మొదలుపెట్టారు. ఆ తర్వాత కొత్త లక్షణాలు బయటపడటంతో వైద్యులు సైతం ఆందోళన పడ్డారు. ముక్కులో నుంచి నీరు కారడం, తలనొప్పి రావడం ఈ ‘ఫ్లూ వైరస్’ లక్షణాలుగా ఉన్నాయి.చిన్నపిల్లలు, వృద్దులలో ఈ వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటుంది.