మంత్రి వనిత (సిరా న్యూస్)
కొవ్వూరు
కొవ్వూరు నియోజకవర్గం కొవ్వూరు రూరల్ మండలం దొమ్మేరులో గత రెండు రోజులుగా జరిగిన పరిణామా లపై తనకు సంబంధం లేకపోయినా కొంతమంది మహేంద్ర మరణాన్ని స్వార్థ రాజకీయాలకు ఉపయో గించుకోవడం బాధాకరమని రాష్ట్ర హోం విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి తానేటి వనిత తెలిపారు. దొమ్మేరు పరిణామాలన్నీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డికి వివరించామని, మహేంద్ర మరణంపై అన్ని వాస్తవాలు బయటకు వచ్చేలా తాను విచారణ కోరగా.. ముఖ్యమంత్రి సీఐడీ విచారణకు ఆదేశించా రని తానేటి వనిత వెల్లడించారు.దొమ్మేరులో మహేంద్ర మరణం, దానిపై తనను నిందించడం చాలా మనస్థా పానికి గురయ్యానని తెలిపారు. మహేంద్ర మరణంలో తాను ఏ విధంగా కారకులు అవుతానని ప్రశ్నించారు. తనపై వచ్చిన అభియో గాలపై ఇంకా ఆశ్చర్యంలోనే ఉన్నాన న్నారు. కొవ్వూరు నియోజకవర్గంలో రాజకీ యంగా వైసీపీని ఎదుర్కొలేక తనపై, ప్రభుత్వం మీద, పార్టీ మీద జనసేన పార్టీ వాళ్లు రాజకీయ కుట్ర చేస్తు న్నారన్నారు. అమాయకులైన దళితులను ఉపయోగిం చుకుని బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారన్నా రు. దీనికి చెక్ పెట్టేందుకు సీఐడీ ఎంక్వైరీ ముఖ్యమంత్రిని కోరామని తెలిపారు.