సిరా న్యూస్. కరీంనగర్:
మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త గాలన్న అనారోగ్యంతో మృతి
చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ భర్త బొడిగ గాలయ్య అనారోగ్యంతో మృతి చెందారు. గ్రామస్తులు బంధువులు తెలిపిన వివరాల ప్రకారం గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ కరీంనగర్ లో ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. గాలన్న ది కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెంకటేశ్వర్లపల్లి స్వగ్రామం.శనివారం ఉదయం 10 గంటలకు స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దళిత ఉద్యమాల్లో పనిచేస్తూ తొలితరం ఎమ్మార్పీఎస్ నాయకుడిగా సేవలందించారు.కరీంనగర్ లో స్థిరపడి చొప్పదండి నియోజకవర్గం లో భార్య బడిగే శోభను ఎమ్మెల్యేను చెయ్యడానికి అహర్నిశలు కృషిచేశారు. గాయన్న సేవలు మరువలేని అభిమానులు కార్యకర్తలు గుర్తు చేసుకున్నారు. అయన మరణం దళిత సంఘం కి తీరని లోటు అని.దళితుల అభ్యున్నతికి అయిన చేసిన కృషి మరువలేనిది అని సంఘం నాయకులు గుర్తు చేసుకున్నారు..