మాజీ డీజీపీ అల్లుడు అరెస్ట్….

విజయవాడ, (సిరా న్యూస్);
ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ నండూరి సాంబశిరావును ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ట్రాఫిక్ చలాన్ల ద్వారా వసూలు చేసిన డబ్బుల్ని సొంత ఖాతాలకు మళ్లించుకున్నారనే అభియోగాలపై కొమ్మిరెడ్డిని అవినాష్‌ను ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు.గత కొన్నేళ్లుగా ఏపీలో ప్రజల నుంచి వసూలు చేస్తున్న ఈ చలాన్ల సొమ్ముల్ని మాజీ డీజీపీ అల్లుడు అవినాష్‌ తన సొంత ఖాతాకు మళ్లించుకున్నాడు. ఈ వ్యవహారంలో పోలీసు శాఖకు భారీగా ఆదాయానికి గండిపడింది. కొమ్మిరెడ్డి అవినాష్‌ను ఎట్టకేలకు పోలీ సులు అరెస్టు చేశారు. నిందితుడికి చెందిన చెందిన 16 ఆస్తు లను సీజ్ చేశారు.ట్రాఫిక్‌ చలాన్ల వ్యవహారంలో ఉన్న లోపాలపై డీజీపీ అంతర్గత విచారణకు ఆదేశించారు. ట్రాఫిక్‌ ఉల్లంఘనలపై పెనాల్టీలను ‘రేజర్ ‘పే’ అనే పేమెంట్ గేట్‌వే ద్వారా డీజీ ఖాతాకు జమ చేయాల్సి ఉండగా ఒప్పందానికి విరుద్ధంగా నిందితుడు రేజర్ పేకు బదులు రేజర్ పీఈ అనే గేట్‌వే ఖాతాకు మళ్లించాడు.ఇలా ప్రజలు చెల్లించిన పెనాల్టీల సొమ్మును పెద్ద మొత్తంలో దారి మళ్లించారు. గుంటూరు జిల్లా మంగళగిరి పోలీసు స్టేషన్లో ఈ వ్యవహారంపై కేసు నమోదైంది. అవినాష్‌ను ఈ కేసులో ప్రధాన నిందితుడిగా గుర్తించి అరెస్టు చేశామని గుంటూరు ఐజీ పాలరాజు మీడియాకు వెల్లడించారు.2018 నుంచి 2019 జనవరి వరకు రూ.36.58 కోట్ల ఈ-చలానా సొమ్మును అవినాష్ తన ఖాతాకు మళ్లించుకున్నట్లు తేలిందని చెప్పారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *