విజయవాడ, (సిరా న్యూస్);
పీలో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమైంది. ప్రస్తుతం ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఒక వైపు ఆ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్నప్పటికీ కేంద్ర ఎన్నికల సంఘం వచ్చే ఏడాది జరగనున్న సార్వత్రిక ఎన్నికల ఏర్పాట్లు కూడా వేగంగా చేస్తున్నది. ఆ సార్వత్రిక ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వచ్చే ఏడాది మార్చిలోనే సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు ఆరంభించేసింది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే రాష్ట్రంలో ఎన్నికలకు సంబంధించి క్షేత్ర స్థాయి కార్యాచరణను ఎన్నికల సంఘం ఇప్పటికే దాదాపుగా పూర్తి చేసేసింది. ఈవీఎంలను జిల్లాలకు తరలిచినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఎన్నికల షెడ్యూల్ ఫిబ్రవరి 2న విడుదలయ్యే అవకాశాలున్నాయి. అలాగే ఏపీలో మార్చి మొదటి వారంలోనే ఎన్నికలు జరుగుతాయని ఆ వర్గాలు చెబుతున్నాయి. మార్చి 6న ఏపీలో ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఏపీలో ఓటర్ల జాబితాను సవరించి ముసాయిదాను ప్రకటించడం కూడా పూర్తయిపోయింది. ఈ ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలను స్వీకరించి డిసెంబర్ నాటికల్లా వాటిని పరిష్కరించే లక్ష్యంతో కేంద్ర ఎన్నికల సంఘం ఉంది. అసలు ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటే ఏపీ అసెంబ్లీకి కూడా ఎన్నికలు నిర్వహించే అవకాశాలున్నాయని గతంలో విస్తృతంగా ప్రచారం అయ్యింది. అప్పట్లోనే కేంద్ర ఎన్నికల సంఘం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు కూడా చేసిందని అప్పట్లో రాజకీయవర్గాలలో జోరుగా చర్చ జరిగింది. అసలు ఏడాదిన్నర కిందటి నుంచే ఏపీలోని జగన్ సర్కార్ ముందస్తు ఎన్నికల ముచ్చటను తెరమీదకు తెచ్చింది