(సిరా న్యూస్);
శ్రీకాళహస్తీశ్వరాలయంలో నిర్వహించే కాల సర్ప దోష నివారణ రాహు కేతు దోష నివారణ పూజలకు భక్తుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. ముఖ్యంగా శని, ఆది, సోమ, మంగళవారాల్లో ఈ పూజలను భక్తులు రాహుకాల సమయంలో జరిపించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో శనివారం శనిత్రయోదశి ఘడియలు కావటం తో భక్తులు తండోపతండాలుగా కదలి వచ్చారు.
ఆలయ ఇఓ రామరావు అకస్మిక తనిఖీలు
శ్రీకాళహస్తీశ్వరాలయానికి వస్తున్న భక్తులు ఎదుర్కొంటున్న సమస్యల దృష్ట్యా శనివారం ఈఓ రామారావు రాహు కేతు పూజ మండపాల్లో ఆకస్మిక తనిఖీలు జరిపారు. పరిపాలన పై వస్తున్న విమర్శలు ఆరోపణలను పరిగణలోకి తీసుకున్న ఈఓ రామారావు పరిపాలనలో , శనివారం నాలుగు గోపురాలు పార్కింగ్ ప్రాంతాల్లో ఇంజనీరింగ్ విభాగంతో కలిసి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు భక్తులు ఎదుర్కొంటున్న సమస్యలను దళారీల సంచారాన్ని వ్యక్తిగతంగా క్షేత్రస్థాయిలో పరిశీలించారు.