సిరా న్యూస్,మల్కాజిగిరి;
అమాయక ప్రజలను ఎంచుకుని మనోరంజన్ బ్యాంక్ నోట్లను నకిలీ నోట్లుగా చెబుతూ మోసానికి పాల్పడుతున్న ముగ్గురు నిందితులను ఎల్బీనగర్ పోలీసులు సహాయంతో ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు వీరి వద్ద నుండి 60 లక్షలు మనోరంజన్ నోట్లు, ఒక కార్ స్వాధీనం చేసుకున్నారు.
వివరాల్లోకెళ్తే అదిలాబాద్ నివాసి మొహమ్మద్ బహుద్దీన్ గతంలో ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో సీనియర్ అసిస్టెంట్ గా పనిచేస్తూ మోసాలకు పాల్పడినందుకు అతని విధుల నుంచి తొలగించారు. నిందితులు ఆండ్రిసన్ , కృష్ణ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో టాక్సీ డ్రైవర్లుగా పనిచేస్తున్నారు. నకిలీ నోట్లు చలామణి చేస్తే మంచి కమిషన్ ఇస్తానని భాహుద్దీన్ ఆండ్రిసన్ చెప్పి అమాయక ప్రజలను గుర్తించి 1:3 రేషియో గా మనోరంజన్ నోట్లు చలామణి చేస్తుండగా ఎల్బీనగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు రాచకొండ సి పి సుధీర్ బాబు తెలిపారు.