సిరా న్యూస్, ఓదెల:
మల్లికార్జున స్వామి దేవాలయానికి పోటెత్తిన భక్తజనం..
పెద్దపల్లి జిల్లా లోనే అతిపెద్ద పుణ్యక్షేత్రమైన ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి దేవస్థానమునకు ఆదివారం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో మొక్కలు చెల్లించుకున్నారు. ఎండను సైతం లెక్కచేయకుండా పెద్ద సంఖ్యలో భక్తులు మొక్కులు తీర్చుకోవటానికి మల్లికార్జున స్వామి దేవస్థానమునకు వస్తున్నారు. గుడి ముందల పట్నం వేసి బోనాలు చెల్లించి. కోడను కట్టి భక్తులు తమ మొక్కలను తీర్చుకుంటున్నారు. భక్తుల కోసం ఆలయం సిబ్బంది చలవ పందిళ్లు, త్రాగునిరు, ఇతరత్రా సౌకర్యాలు కల్పించినారు.