సిరిసిల్ల ,(సిరా న్యూస్);
తెలంగాణ రాష్ట్రం ఏర్పడి గత పదేళ్ల లో 400 మంది చేనేతలు ఆత్మహత్యలు చేసుకున్నా , సొంత జిల్లా కరీం నగర్ చొప్పదండి లో ఒకేరోజు ముగ్గురు నేతన్నలు ఆత్మహత్యలు చేసుకున్నా స్పందించని, పరామర్శించని మంత్రి కేటీఆర్ కు ప్రజలు ఎందుకు ఓటేయాలని బిసి రాజ్యాధికార సమితి అధ్యక్షులు దాసు సురేష్ ప్రశ్నించారు. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కుటుంబాలలోని మహిళలతో కలిసి దాసు సురేష్ సోమవారం నాడు సిరిసిల్ల ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. చేనేత శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్.. సిరిసిల్లలోని నేతన్నలను బతుకమ్మ చీరల ముసుగులో మోసం చేసి నకిలీ పట్టు చీరల కాంట్రాక్టులు పక్క రాష్ట్రాల లోని తన చీకటి మిత్రులకు ఇప్ప్పించి వేల కోట్ల వ్యాపార లావాదేవీలలో కమీషన్లు పొందారన్నారు.. ఈ కారణం చేతనే రాష్ట్రంలో చేనేత రంగం కుదేలయ్యితెలంగాణా ఏర్పాటు సమయంలో ఉన్న 400 పై చిలుకు సహకార సంఘాలు నేడు వందకు పరిమితమయ్యాయన్నారు.నకిలీ చేనేత వస్త్రాలను వ్యాపారాన్ని తమ కార్పొరేట్ మిత్రులకు కామధేనువుగా సృష్టించి నేతన్నల నడ్డివిరిచి నేతన్నల ఆత్మహత్యలకు కారణమయ్యారన్నారు ..ఈ వేల కోట్ల వ్యాపారంలో సినీ ప్రముఖుల ప్రకటనలతో తెలంగాణ ప్రజలను మహిళలను నిండా ముంచారన్నారు.సహకార సంఘాలకు పదేళ్లుగా ఎన్నికలు నిర్వహిచకుండా పద్మశాలి నాయకత్వాన్ని నిర్వీర్యం చేశాడని కేటీఆర్ పై దాసు సురేష్ విరుచుకుపడ్డారు. సిరిసిల్ల నేతన్నలకు 200 రూపాయల బతుకమ్మ చీరల కాంట్రాక్టులు… పక్క రాష్ట్రంలో నకిలీ చీరలకు వేలకోట్ల రూపాయల కాంట్రాక్టులు ఇచ్చిన చరిత్ర కేటీఆర్ దని ఆరోపించారు. టెస్కో షోరూమ్లను ప్రారంభించాల్సిన మంత్రులు… కార్పోరేట్ షాపింగ్ మాల్స్ ను ప్రారంభిస్తూ చేనేతలకు అన్యాయం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేతలను ఆదుకోని కేటీఆర్… పక్క రాష్ట్రాల్లో పంజాబ్ హర్యానాలో బాధితుల కుటుంబాలకు 5 లక్షల రూపాయల అందించడం ఏ విధంగా న్యాయమని ప్రశ్నించారు.