నంద్యాల , (సిరా న్యూస్);
నంద్యాల
యాగంటి శ్రీ ఉమామహేశ్వర స్వామి ఆలయంలో కార్తీకమాసం మొదటి సోమవారాన్ని పురస్కరించుకొని తెల్లవారుజామున నుంచే స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో పోటెత్తారు. మొదటి సోమవారం సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గం శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి కాటసాని జయమ్మ స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం కాటసాని రామిరెడ్డి కాటసాని జయమ్మ దంపతులకు పాలకమండలి చైర్మన్ కార్యనిర్వహణ అధికారులు ఆలయ మర్యాదలతో సత్కరించిన అనంతరం తీర్థప్రసాదాలు అందించారు.
ఈ సందర్భంగా బనగానపల్లె నియోజకవర్గ శాసనసభ్యులు కాటసాని రామిరెడ్డి మాట్లాడుతూ, కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా యాగంటి మహాక్షేత్రంలో పెద్ద ఎత్తున భక్తులు పాల్గొనడం జరిగిందని, ఈ సంవత్సరం కూడా మంచి వర్షాలతో పాడిపంటలతో నియోజకవర్గము రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉండాలని ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని స్వామివారికి అభిషేకం నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ నాయకులు యామ మనోహర్ రెడ్డి పాలకమండలి సభ్యులు తిరుపాలు ,పుల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.