సిరా న్యూస్,విశాఖపట్నం;
విశాఖలో యువతరం ఫ్లాష్ మాబ్ డాన్స్ తో అదరగొట్టింది.అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా విద్యార్ధులు ఫ్లాష్ మాబ్ డాన్సులతో ఆకట్టుకున్నారు.నేటి ఆధునిక యుగంలో మహిళలు సాదిస్తున్న విజయాలను చాటి చెబుతూ విద్యార్ధులు నృత్యాలు చేస్తూ సందడి చేశారు.ధీమ్ మ్యూజిక్ కు తగ్గట్టుగా స్టెప్పులు వేస్తూ కేరింతలు కొడుతూ మహిళా దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.తలచుకుంటే ఏదైనా సాదించవచ్చే లక్ష్యంతో ముందుకు సాగుతున్న నారీ మణుల కీర్తి ప్రతిష్టతను విద్యార్ధులు తమ నృత్యాల ద్వారా విశ్వవ్యాప్తి చేశారు.విద్యార్ధుల నృత్యాలను తిలకించేందుకు భారీగా విద్యార్ధులు తరలిరావడంతో సందడి నెలకొంది.