శ్రీకాకుళం… (సిరా న్యూస్);
మండల కేంద్రం కంచిలి సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం ఓ లారీ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ క్లీనర్ క్షేమంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న నేషనల్ హైవే సిబ్బంది, పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని వాహనాన్ని సురక్షిత ప్రాంతానికి తరలించే పనిలో పడ్డారు. డ్రైవర్ నిద్ర మత్తే ప్రమాదానికి కారణమని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.