సిరా న్యూస్,మైలవరం;
ఎన్టీఆర్ జిల్లా రాయనపాడులో వికసిత్ భారత్ సంకల్ప యాత్రను కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ శనివారం ప్రారంభించారు. తొలుత వివిధ స్టాల్స్ ను ఆమె పరిశీలించారు. ఆమెతో పాటు రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్, జిల్లా కలెక్టర్ ఎస్.ఢిల్లీరావు, జిల్లా ఉన్నతాధికారులు ఉన్నారు.