సిరా న్యూస్, సూర్యాపేట:
రాష్ట్ర మంత్రివర్గంలో వికలాంగులకు అవకాశం కల్పించాలి .. గిద్దె రాజేష్
వికలాంగుల సంక్షేమ శాఖకు వికలాంగుడినే మంత్రిగా నియమించేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కృషి చేయాలని. సూర్యాపేట జిల్లా కలెక్టరేట్లో నిర్వహించిన అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవ సభలో భారత వికలాంగుల హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు గిద్దె రాజేష్ అన్నారు అనంతరం అయినా మాట్లాడుతూ ;తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గంలో 76 ఏళ్ల నుంచి రాజ్యాధికారానికి దూరమై దుర్భర జీవితాలు గడుపుతున్న వికలాంగులకు అవకాశం కల్పించాలని ఆశాభావం వ్యక్తం చేసారు. అధికారులు గాలికి వదిలేస్తూ వికలాంగుల సంక్షేమాన్ని పత్రికల్లో ప్రచురణకే పరిమితం చేస్తూ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు వికలాంగుల సమాజానికి సక్రమంగా అందించకుండా తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు సంభందించిన అధికారులు పాల్గొన్నారు