రాహుల్ గాంధీ సభాస్థలిని పరిశీలించిన బాలురి గోవర్ధన్ రెడ్డి…

సిరా న్యూస్, అదిలాబాద్:

ఈనెల 25న ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం లో నిర్వహించనున్న రాహుల్ గాంధీ సభ కోసం కాంగ్రెస్ నాయకులు బాలూరి గోవర్ధన్ రెడ్డి పరిశీలించారు. జైనథ్ మండలం హసీంపూర్ గ్రామ శివారు సమీపంలో సభస్థలిని ఎంపిక చేసినట్లు తెలిపారు. రాహుల్ గాంధీ హెలికాప్టర్ ల్యాండింగ్ కోసం అనువుగా ఉన్న ప్రదేశంతో పాటు వివిధ మండలాల ప్రజల రాకపోకలకు వీలుగా 44వ నెంబర్ జాతీయ రహదారి పక్కన స్థలాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈనెల 25న నిర్వహించనున్న ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద ఎత్తున హాజరై సభను విజయవంతం చేయాలని కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *