రిజర్వేషన్లు ఎత్తి వేస్తామన్న బిజెపి ని ఓడించండి

సిరా న్యూస్, బేలా:

రిజర్వేషన్లు ఎత్తి వేస్తామన్న బిజెపి ని ఓడించండి

మండల పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ 

రిజర్వేషన్లు ఎత్తి వేస్తామన్న బిజెపిని ఓడించాలని బేల మండల పార్టీ అధ్యక్షులు ఫైజుల్లా ఖాన్ అన్నారు. ఆదిలాబాద్ పార్లమెంట్ అభ్యర్థి ఆత్రం సుగుణక్క కు మద్దతుగా ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం బేలా మండలంలోని రంఖం గ్రామంలో ఇంటింటా తిరుగుతు కాంగ్రెస్  గ్యారెంటీ కార్డులను అందిస్తూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా  ఫైజుల్లా ఖాన్ మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ప్రభుత్వం పేద,బడుగు,బలహీన, వర్గాల అభివృద్ధిని పట్టించుకోలేదని. ముఖ్యంగా రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాల వల్ల  700 మంది రైతులు ప్రాణాలు కోల్పోయారని. రాజ్యాంగాన్ని మార్చే కుట్ర జరుగుతుందని. ఒకవేళ మళ్లీ బిజెపి గెలిస్తే రిజర్వేషన్ల ను తొలగిస్తుందని అన్నారు. కార్యక్రమంలో విలాస్ పటేల్, అనిల్ ధోటే, బీర్షావ్ మాధవ్ రావు, శాలిక్, విశాల్, వికాస్, తదితరులు పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *