సిరా న్యూస్, చిగురు మామిడి:
రేకొండలో పూర్వ విద్యార్థుల ఆత్మీయ అపూర్వ సమ్మేళనం..
ఆడుతూ పాడుతూ చిన్ననాటి జ్ఞాపకాలను నెమరు వేసుకున్న పూర్వవిద్యార్థులు..
కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రేకొండ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల 1996-97వ పదో తరగతికి చెందిన దాదాపు 60మంది పూర్వ విద్యార్థులు ఒకే వేదికపై ఆదివారం కలిశారు.చిన్ననాటి స్నేహితులతో కలిసి చదువుకున్న అదే ప్రభుత్వ పాఠశాలలో సోషల్ మీడియా వేదికగా కలుసుకొని ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేసుకున్నారు.గత జ్ఞాపకాలను గుర్తు చేసుకొని రోజంతా సంతోషంగా ఆడుతు పాడుతు గడిపారు.చిన్ననాడు చేసిన అల్లరి పనులు,గడచిన రోజులను, ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగాలు, కుటుంబ పరిస్థితులు,జీవనోపాధి గురించి ఒకరినొకరు పలకరించుకున్నారు.కుటుంబ సమస్యలు,ఉద్యోగాలు,బిజీబిజీ జీవితంలోను అందరూ ఒకే చోట కలవడంతో పండగ వాతావరణం నెలకొంది.నాడు చదువు చెప్పిన గురువులకు శాలువాలు కప్పి మెమొంటోలు అందజేసి గురువుల ఆశీర్వాదం తీసుకున్నారు.కేక్ కట్ చేసిన అనంతరం అందరూ కలిసి సహపంక్తి భోజనాలు చేసి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపారు.సంతోషంలోనే కాకుండా ఎవరికి ఎలాంటి ఆపద వచ్చిన తోచిన సహాయం చేద్దాం అని చెప్పారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ దినపత్రిక కరీంనగర్ జిల్లా బ్యూరో కొమ్మెర తిరుపతిరెడ్డి,తట్ల తిరుపతి, తమ్మిశెట్టి రాములు,మండలా అనిల్,అప్పల సదానందం, పంకెర్ల శ్రీనివాస్, పడాల శ్రీనివాస్ గౌడ్, ఎగ్గిడి శ్రీనివాస్,తీగల చంద్రమౌళి, చెంజర్ల తిరుపతి, ఏరుకొండ రాజు, కొడముంజ మధు,డాక్టర్ తిరుపతి, అప్పల సదానందం, మోర తిరుమల,అందే సరస్వతి,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.