రైతులెవరు అధైర్య పడవద్దు.. ఎమ్మెల్యే దొరబాబు
సిరా న్యూస్, గొల్లప్రోలు :
పిఠాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే పెండం దొరబాబు గొల్లప్రోలు మండలంలో పర్యటించారు. గొల్లప్రోలు పట్టణ శివారులో గల జగనన్న కాలనీలో పర్యటించి కనీస మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. చేబ్రోలులో చెరువుకు పడిన గండిని పరిశీలించారు. ఏకే మల్లవరం గ్రామములో మిచౌంగ్ తుఫాన్ కారణంగా పిబిసి కాలువ గండి పడి పొలాల్లో ఉన్న ధాన్యం రాసులు ,ధాన్యం కుప్పలు మొత్తం జలమయం అయ్యాయి. ఆ స్థలానికి చేరుకొని నీట మునిగిన పంటలను ఎమ్మెల్యే దొరబాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడితూ ఎవ్వరు ఆధ్యర్య పడొద్దుని ప్రభుత్వం తరుపున సహాయ సహకారాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. గండి కొట్టిన పిబిసి కాలువ పనులను తక్షణమే పునరుద్దించాలని అధికారులకు సూచించారు