లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ హర్షిత కి  సన్మానం..

 సిరాన్యూస్, ఆదిలాబాద్: 

 లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ హర్షిత కి  సన్మానం..

ఉట్నూర్ నివాసులైన  లంబాడి జాతికి చెందిన ఉపాధ్యాయుడు పవార్ విజయకుమార్ నేహా దంపతుల మొదటి సంతానం పవార్ హర్షిత. చదువుల్లో రాణించి పదవ తరగతి, ఇంటర్మీడియట్ లలో రాష్ట్రస్థాయి ర్యాంకులు సాధించి నిట్ లో జాతీయస్థాయిలో 15వ ర్యాంకు సాధించి ఒడిశాలోని భువనేశ్వర్ ఎమ్స్ లో ఎంబిబిఎస్ పూర్తి చేయడం జరిగింది. నిట్ పిజి  ఎంట్రన్స్ లో రాజస్థాన్ రాష్ట్రంలోని జోద్ పూర్ ఎమ్స్ ఎండీ బయోకెమిస్ట్రీ  సీటు సాధించి జాతి పేరును ఉన్నత శిఖరాలలో నిలబెట్టి ప్రశంసలు అందుకున్న సందర్భంగా. స్థానిక లంబాడి జేఏసీ ఆధ్వర్యంలో డాక్టర్ పవార్ హర్షిత ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ చదువుల్లో రాణిస్తూ వైద్య విద్యలో ఉన్నత శిఖరాలను అదిరోహిస్తూ ముందుకు సాగుతున్న డాక్టర్ పవార్ హర్షిత గిరిజన విద్యార్థులకు స్ఫూర్తిదాయకమని అదేవిధంగా భవిష్యత్తులో పేద గిరిజనులకు నాణ్యమైన వైద్యాన్ని అందించి సేవ చేయాలని కొనియాడారు.ఈ కార్యక్రమంలో లంబాడి  జెఏ సి జిల్లా ప్రధాన కార్యదర్శి బానోత్ రామారావు,గౌరవ సలహాదారులు భరత్ చౌహన్,జిల్లా కార్యదర్శి జెపి నాయక్,టిటిఎఫ్  ప్రధాన కార్యదర్శి గణేష్ రాథోడ్, మురళీ జాధవ్, ధరంసింగ్ జాధవ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్  ఖండ వ్యవస్థ ప్రముఖ్ సాడిగే రాజగోపాల్,ధర్మజాగరణ సమితి ప్రముఖ్ రామగిరి అంజన్న, తదితరులు పాల్గొన్నారు..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *