వరల్డ్ వైడ్‌గా ‘డంకీ డ్రాప్ 2- లుట్ పుట్ గయా…’ మెలోడి సాంగ్‌కి అమేజింగ్ రెస్పాన్స్..

 

 

(సిరా న్యూస్);

24 గంటల్లో 30 మిలియన్స్ వ్యూస్‌తో దూసుకెళ్లోన్న పాట
* ప్రీతమ్ సంగీతంలో అర్జిత్ పాడిన అద్భుతమైన పాటకు అద్భుతమైన స్పందన

బాలీవుడ్ బాద్ షా షారూక్ ఖాన్, సక్సెస్‌పుల్ డైరెక్టర్ రాజ్‌కుమార్ హిరాణి కాంబినేషన్‌లో రూపొందుతోన్న మోస్ట్ అవెయిటింగ్ మూవీ ‘డంకీ’. బుధవారం ఈ చిత్రం నుంచి ‘డంకీ డ్రాప్ 2’ అంటూ సినిమా నుంచి ‘లుట్ పుట్ గయా..’ పాటను మేకర్స్ విడుదల చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న సినీ సంగీతాభిమానుల హృదయాలను ఈ పాట హత్తుకుంది. ప్రేమలోని స్వచ్చతను తెలియజేసే ఈ పాట కచ్చితంగా మీ ప్లే లిస్టులో స్థానాన్ని కలిగి ఉంటుందనటంలో సందేహం లేదు.
ఆడియెన్స్‌కి తిరుగులేని ట్రీట్‌ని అందించిన ‘లుట్ పుట్ గయా..’ పాట విడుదలైన 24 గంటల్లోనే 30 మిలియన్ వ్యూస్‌ను సంపాదించుకుంది. దీంతో రాజ్‌కుమార్ హిరాణి రూపొందిస్తోన్న ‘డంకీ’ ప్రపంచంలో ఇంకెన్ని ఆసక్తికరమైన విషయాలు ఉండబోతున్నాయోనని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సినిమాపై అంచనాలు పెరిగాయి.
షారూక్ ఖాన్ పాత్ర ఇంకెలా ఉంటుందోననే ఆసక్తి అభిమానులకు, సినీ ప్రేక్షకులకు కలిగింది. ఇదే ఆసక్తిని వారు #AskSrk సెషన్‌లో కనపరిచారు. లుట్ పుట్ గయా పాటపై తమ ప్రేమను వారు మాటల రూపంలో కింగ్ ఖాన్‌కి తెలియజేశారు.
‘డంకీ’ చిత్రంలో టాలెంటెడ్ ఆర్టిస్టులు ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *