వాళ్లంతా మృత్యుంజయలు

సిరా న్యూస్,;
వాళ్లంతా మృత్యుంజయులు.. ఉత్తరాఖండ్‌ ఉత్తరకాశీ టన్నెల్‌లో గత 17 రోజులుగా నరకం చూసిన 41 మంది కార్మికులు సురక్షితంగా బయటపడ్డారు. ఒక్కొక్కరు బయటకు తీసుకొచ్చారు ఎన్డీఆరెఫ్ సిబ్బంది. బయటకు వచ్చిన కార్మికులను వెంటనే అంబులెన్స్‌ల్లో ఆస్పత్రికి తరలించారు. .అత్యవసర వేళ్లలో ఉపయోగించడానికి ఆర్మీ హెలికాప్టర్‌ను కూడా రెడీ చేశారు. కార్మికుల కోసం 41 వార్డులను కూడా ఆస్పత్రిలో సిద్దం చేశారు. సిల్వారా టన్నెల్‌లో ఈనెల 12వ తేదీన కార్మికులు చిక్కుకుపోయారు.. 41 మందిని రక్షించడంతో వాళ్లంతా ఊపిరి పీల్చుకున్నారు.ఎస్కేప్‌ పైప్‌ నుంచి కార్మికులను బయటకు తీసుకొచ్చారు. టన్నెల్‌ నుంచి బయటకు వచ్చిన కార్మికులు ఆరోగ్యంగా ఉన్నారని అధికారులు వెల్లడించారు. సహాయక చర్యలను ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌సింగ్‌ ధామి స్వయంగా పర్యవేక్షించారు. టన్నెల్‌ లోపలికి వెళ్లి పరిస్థితిని ఆయన స్వయంగా సమీక్షించారు.ర్యాట్‌హోల్‌ మైనింగ్‌ సిబ్బంది సహాయక చర్యల్లో కీలకపాత్ర పోషించారు. ప్రస్తుతం అయితే వారికి ఆహారం, నీరు, గాలి పంపిస్తున్నారు..కోట్లాది మంది భారతీయుల ప్రార్థనలు ఫలించాయి. ఉత్తరాఖండ్ సొరంగంలో చిక్కుకొని 17 రోజులుగా బిక్కుబిక్కుమంటూ గడిపిన కార్మికులు ఒక్కొక్కరు బయటకి వస్తున్నారు. అధికారుల ప్రయత్నాలు ఫలించాయి. విదేశీ యంత్రాలు విఫలమైన వేళ.. దేశీయ నిపుణుల శ్రమ ఫలితాలను ఇచ్చింది. ‘ర్యాట్‌ హోల్‌ మైనర్లు’ (బొగ్గు గనుల్లో సన్నని మార్గాలను తవ్వడంలో నిపుణులు) అద్భుతం చేశారు. సోమవారం రాత్రి నుంచి మెరుపు వేగంతో తవ్వకాలు చేపట్టినే 12 మంది ర్యాట్ హోల్ మైనర్లు.. 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తి చేసి.. కూలీలు ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. ఆ తర్వాత గొట్టాన్ని పంపించి అందులో నుంచి కార్మికులను ఒక్కొక్కరిని బయటకు తీసుకొస్తున్నారు.

సోమవారం రాత్రి నుంచి విరామం లేకుండా తవ్వకాలు చేపట్టడంతో 57 మీటర్ల డ్రిల్లింగ్‌ పూర్తయ్యింది. ఆ తర్వాత కూలీలు ఉన్న ప్రాంతం వరకు గొట్టాన్ని పంపించి అందులో నుంచి ఒక్కొక్కరినీ బయటకు తీసుకొచ్చారు.41 మందిలో ఒక్కొక్కరిని తరలించేందుకు 3-5 నిమిషాల సమయం పడుతుందని అంచనా వేశారు పూర్తి తరలింపునకు 3-4 గంటలు పట్టవచ్చని భావిస్తున్నారు.చిన్యాలిసౌర్ ఎయిర్‌స్ట్రిప్‌లో చినూక్ హెలికాప్టర్ ను సిద్దం చేసి ఉంచారు. అయితే ఈ హెలికాప్టర్ సాయంత్రం 4:30 లోపే టేకాఫ్ అవ్వాలి. రాత్రి పూట ఇది ఎగరకూడదు.  జిల్లా ఆసుపత్రిలో 30 పడకల సౌకర్యంతో పాటు 10 పడకల సౌకర్యంతో ఏర్పాట్లు పూర్తి చేశారు.కార్మికులు క్షేమంగా బయటకు కావడంతో వాళ్ల కుటుంబసభ్యులు చాలా ఆనందంగా ఉన్నారు. రెస్క్యూ సిబ్బందికి వాళ్లు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికులు క్షేమంగా బయటకు రావడంతో వాళ్ల కుటుంబసభ్యులు స్వీట్లు పంచుకున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *