సిరా న్యూస్, ఆదిలాబాద్
విద్యార్థుల కోసం గ్రామాలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలి : బి.జి.ఆర్..
ఆదిలాబాద్ జిల్లాలోని మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసీ బస్సు సేవలను కొనసాగించాలని డీసీసీబీ డైరెక్టర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాలూరి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు . జిల్లాలోని పలు గ్రామాలకు ఆర్టీసీ సేవలు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఈ విషయమై శుక్రవారం ఆదిలాబాద్ ఆర్టీసీ డిపో మేనేజర్ కల్పన కు వినతి పత్రం సమర్పించారు. గతంలో లక్ష్మీపూర్ టు వయా చాంద (టి) బస్సు ను నిలిపివేయడంతో చాలామంది విద్యార్థినిలు ఇబ్బంది పడుతున్నారని తిరిగి ఈ రూట్ లో బస్సు పున: ప్రారంభించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందున మహిళలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. సానుకులంగా స్పందించిన డిపో మేనేజర్ సమస్యను ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కొండూరి రవి, చిందం శ్రీధర్త తదితరులు పాల్గొన్నారు