సిరా న్యూస్,ఘట్కేసర్;
మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ విజ్ఞాన్ స్కూల్ లో షార్ట్-సర్క్యూట్ తో ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు అక్కడికక్కడే మృతి చెందారు. విజ్ఞాన్ స్కూల్ లో అల్పాహారం తీసుకున్న తర్వాత తిరిగి తన క్వార్టర్స్ కు చేరుకొని క్వార్టర్స్ పైభాగంలో నీరు నిల్వ ఉండడంతో రాడ్డుతో నీటిని తొలిగిస్తుండగా క్వార్టర్స్ పైభాగం ఉన్న విద్యుత్ వైర్లకు రాడ్డు తగిలి షాట్ సర్క్యూట్ తో అక్కడికక్కడే మృతి చెందిన ప్రిన్సిపాల్ శ్రీనివాసరావు..
ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావుకు స్కూల్ యాజమాన్యం కేటాయించిన క్వార్టర్స్ లో ఒంటరిగా ఉంటూ, స్కూల్ లో విద్యార్థులకు బోధన చేస్తు విధులు నిర్వహిస్తున్నాడు..సాయంత్రం 4 గంటల ప్రాంతంలో అదే కళాశాలలో పనిచేస్తున్న మరో ఉపాధ్యాయుడు రాజేష్ స్కూల్ పై భాగంలో పడి ఉన్న శ్రీనివాసరావును గమనించి వెంటనే యాజమాన్యానికి, పోలీసులకు సమాచారం అందించాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు.