వినూత్నంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి….

నెల్లూరు, (సిరా న్యూస్);
నెల్లూరు రూరల్ టీడీపీ ఇంచార్జ్, ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి రాజకీయాల్లో వినూత్నంగా ప్రయత్నిస్తున్నారు. ఆయన ప్రజల్లోకి వెళ్లే విధానం భిన్నంగా ఉంటుంది. వైసీపీలో ఉన్నప్పటికీ ప్రభుత్వ తీరుపై వ్యతిరేకత వ్యక్తం చేయడంలో ఎప్పుడూ తగ్గలేదు. ప్రభుత్వాసుపత్రి సిబ్బందికి జీతాలు రావట్లేదని ధర్నా చేసినా.. డ్రైనేజీ పనులు చేయడం లేదని.. డ్రైనేజీలో కూర్చుని నిరసన తెలిపినా ఆయన ప్రత్యేకత ాయన చూపిస్తున్నారు. ఇప్పుడు విపక్ష పార్టీలోకి మారిపోయి.. వచ్చే ఎన్నికల కోసం వినూత్నంగా సిద్ధమవుతున్నారు. ఆయన ఇప్పుడు లక్ష మంది ప్రజలను నేరుగా కలిసి సమస్యలు వినేందుకు సిద్ధమయ్యారు.  ఒక్కడే ఒంటరిగా లక్ష మందితో మాటా మంతి పేరుతో  వినూత్న కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టాలని నిర్ణయించుకున్‌నారు.  లక్ష మందిని కలిసి మాట మంతి ద్వారా సమస్యలు తెలుసుకొనున్నారు.  ఈ నెల 25వ తేదీ నుంచి 33 రోజుల పాటు ‘ఒక్కడే.. ఒంటరిగా..’ పేరుతో కార్యక్రమం చేపట్టబోతున్నట్టు ప్రకటించారు.ఎన్నికల టైమ్ లో నియోజకవర్గంలోని ప్రతి గడపకు వెళ్తున్నారు కోటంరెడ్డి . మీడియా  కూడా లేకుండా కార్యక్రమం నిర్వహిస్తాను అని వెల్లడించారు కోటంరెడ్డి.. గత ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి విజయం సాధించిన ఆయన.. ఆ తర్వాత వైసీపీకి గుడ్‌బై చెప్పి.. టీడీపీకి దగ్గరయ్యారు.    ఎమ్మెల్సీ ఎన్నికల తర్వాత ఆయనతో పాటు మరికొందరిపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేటు వేశారు.  ప్రజల్ని నేరుగా కలవడం కంటే ఓ నాయకుడికి పెద్ద ప్లస్ పాయింట్ ఉండదు. శ్రీధర్ రెడ్డి ఎప్పుడూ జనంలో ఉంటారు. ఆయన అగ్రెసివ్ గా ఉండే లీడర్. కానీ వైసీపీ అంతర్గత రాజకీయాల్లో నలిగిపోయారు. చివరికి నియోజకవర్గానికి వెళ్లవద్దన్న హెచ్చరికలు కూడా ఎదుర్కోవాల్సి వచ్చింది. చివరికి టీడీపీలో చేరారు. ఆ తర్వాత ఆయన రాజకీయం మారిపోయింది. ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసులు పెట్టినా తగ్గలేదు. టీడీపీ నేతలు కూడా కోటంరెడ్డిలా ప్రజల్లోకి వెళ్తే తిరుగు ఉండదన్న అభిప్రాయం ఆ పార్టీ నేతల్లో వినిపిస్తోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *