విష్ణు మంచు బర్త్ డే సందర్భంగా ‘కన్నప్ప’ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలిన చిత్రయూనిట్*

(సిరా న్యూస్);
మోహన్ బాబు, మోహన్ లాల్, శివ రాజ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ వంటి భారీ తారాగణంతో ప్రారంభమైన కన్పప్ప సినిమాలో విష్ణు మంచు టైటిల్‌ రోల్‌ పోషిస్తున్న సంగతి తెలిసిందే. విష్ణు మంచు డ్రీమ్ ప్రాజెక్ట్‌గా రాబోతున్న ఈ కన్నప్ప ప్రస్తుతం పాన్ ఇండియా స్థాయిలో బజ్ క్రియేట్ చేసింది. విష్ణు మంచు బర్త్ డే (నవంబర్ 23) సందర్భంగా కన్నప్ప నుంచి పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ సినిమా మీద భారీ అంచనాలను నెలకొల్పేలా ఉంది.భారీ శివలింగం.. విల్లుని ఎక్కు పెట్టిన కన్నప్ప లుక్.. ఆ బాణాలు దూసుకెళ్తున్న తీరు.. చుట్టూ ప్రకృతి, దట్టమైన అడవి ఇలా అన్నీ చూస్తుంటే.. తెరపైకి ఓ అద్భుతం రాబోతున్నట్టుగా అనిపిస్తోంది. సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇవ్వడానికి కన్నప్ప ఎంత కష్టపడుతోందో ఈ పోస్టర్ చూస్తుంటేనే అర్థం అవుతోంది. ఈ పోస్టర్‌తో సినిమా స్థాయిని అందరికీ చూపించేసింది కన్నప్ప యూనిట్.
ముఖేష్ కుమార్ సింగ్ ఈ సినిమాను న్యూజిలాండ్ పరిసర ప్రాంతాల్లోనే 80 శాతం షూటింగ్‌ పార్ట్‌ను కంప్లీట్ చేయనున్నారు. న్యూజిలాండ్‌లో ఇంత వరకు తెరపై చూపించని విజువల్స్‌ను అద్భుతంగా చూపించబోతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *