వీధి కుక్కలను నియంత్రించడంలో అధికారులు విఫలం
– జనసేన
నెలకు సగటున 85 మంది కుక్కకాటు భారిన పడుతున్న చర్యలు శూన్యం
సిరా న్యూస్,గోనెగండ్ల;
మండల కేంద్రంలో కుక్కకాటు భారిన పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్న ప్రభుత్వ అధికారుల్లో మాత్రం చలనం లేదని జనసేన పార్టీ నాయకులు గానిగ బాషా తెలిపారు, మండల కేంద్రంలోని శ్రీ చింతలముని నల్లారెడి స్వాముల వారి సత్రంలో నిద్రించే 2 భక్తులపై నిరాశ్రయులైన 2 వృద్దులపై మంగళవారం రోజు తెల్లవారు జామున వీధి కుక్క దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను జనసేననాయకులు టీకాలు వేయించారు, గ్రామాల్లో సామాన్య ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలపై దృష్టి పెట్టాల్సిన స్థానిక నాయకులు ఇళ్లకే పరిమితం కాగా అధికారులకు మాత్రం ప్రజా సమస్యలు ఎలాతెలుస్తాయని వారు ప్రశ్నించారు, గాయలైతే పరామర్శలు చేసి బాధితులు చనిపోతే సంతపాలు చేయడం తప్ప ప్రజలకు పరిష్కార మార్గాలు చూపే నాయకులు కరువైపోయారని అవేదన వ్యక్తం చేశారు,దాదాపు మండలంలో 2023″ సం” లో 11 నెలల వ్యవధిలోనే 1004 మంది పిల్లలు,మహిళలు, వృద్దులు కుక్కకాటుకు గురికావడం బాధాకరమని అన్నారు, పిల్లలను బడికి పంపాలంటే భయం రాత్రి వేళల్లోసన్నకారు వ్యాపారులు పనులు ముగించుకొని ఇళ్లకు రావాలన్న భయమే కుక్కలు అరిస్తే కరుస్తాయనే భయంతో పరుగులు పెట్టే పరిస్థితులు లెక్కలేనన్ని ఉన్నాయని ఇప్పటికైనా ప్రజా ప్రతినిధులుచర్యలు తీసుకొనే విధంగా కృషిచేసి అధికారుల సహాయంతో వీధి కుక్కలను నియంత్రించాలని కోరారు, ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు చెన్నల రాయుడు, సుధాకర్, జనసేన నాయకులు మాలిక్,సుబాన్, మహబూబ్ బాషా, ఇబ్రహీం, రంగస్వామి, జిలాన్ పాల్గొన్నారు,