కర్నూలు,(సిరా న్యూస్);
కర్నూలు జిల్లా నుండి వెయిట్ లిఫ్టింగ్ లో మెడల్స్ సాధించిన క్రీడాకారులను జిల్లా కలెక్టర్ డా.జి.సృజన అభినందించారు.
సోమవారం నగరం లోని ఔట్ డోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ హాల్ లో ఈ కార్యక్రమం జరిగింది.. శ్రీకాకుళం జిల్లాలో ఈ నెల 17 నుండి 19 వరకు నిర్వహించిన 10 వ ఏ.పి.స్టేట్ సీనియర్,జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్ షిప్ క్రీడల పోటీల్లో జిల్లా నుండి వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు 9 మెడల్స్ ను సాధించారు..ఈ సందర్భంగా గోల్డ్, సిల్వర్, బ్రాంజ్ మెడల్స్ సాధించిన వెయిట్ లిఫ్టింగ్ క్రీడాకారులు బి. వీరేష్, డి జి. వీరేష్, అబ్దుల్లా, నరసింహ నాయక్, పర్వేజ్ ముషారఫ్, బి.నాగమణి లను కలెక్టర్ అభినందించారు..ఈ కార్యక్రమంలో సెట్కుర్ సీఈవో రమణ, జడ్పీ సీఈవో నాసర రెడ్డి, కోచ్ యూసుఫ్ బాషా పాల్గొన్నారు..