వైద్య రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం

సామాన్య మానవునికి కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యం. గతంలో కంటే మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నాం

ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో క్యాథ్‌ల్యాబ్, సి. టి.స్కాన్, రక్త నిధి కేంద్రాన్ని ప్రారంభించిన రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్

సిరా న్యూస్,కర్నూలు;

వైద్య రంగానికి రాష్ట్ర ప్రభుత్వం ఇస్తోందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పేర్కొన్నారు.. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలోని కార్డియాలజీ విభాగంలో రూ.5.95 కోట్లతో ఏర్పాటు చేసిన న్యూ క్యాథ్‌ ల్యాబ్ ను, న్యూ డయాగ్నస్టిక్ బ్లాక్ లో రూ.3.5 కోట్లతో ఏర్పాటు చేసిన సి. టి .స్కాన్ ను, రక్తనిధి కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా వివిధ విభాగాల్లో ఏర్పాటు చేసిన యంత్రాల పని తీరును సంబంధిత వైద్యుల ద్వారా మంత్రి అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఛైర్మన్ ఎర్రబోతుల పాపిరెడ్డి,కర్నూలు పార్లమెంటు సభ్యులు డాక్టర్ సంజీవ్ కుమార్, ఎమ్మెల్సీ మధుసూదన్, జిల్లా కలెక్టర్ డా.జి.సృజన, నగర మేయర్ బివై.రామయ్య, పాణ్యం శాసనసభ్యులు కాటసాని రాంభూపాల్ రెడ్డి, కర్నూలు శాసనసభ్యులు హఫీజ్ ఖాన్, ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి సూపరింటెండెంట్ వెంకటరంగారెడ్డి, మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ డా.సుధాకర్, సిఎస్ఆర్ఎంఓ బివి.రావు, యూరాలజీ విభాగ ప్రొఫెసర్ సీతారామయ్య, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *