సిరా న్యూస్,జడ్చర్ల ;
మహాత్మ జ్యోతిబాపూలే 126వ వర్ధంతి పురస్కరించుకొని జడ్చర్ల మండల పరిధిలోని బూరుగుపల్లి గ్రామంలో పులి విగ్రహానికి బీసీ సేన రాష్ట్ర అధ్యక్షులు బూరుగుపల్లి కృష్ణ యాదవ్ పూలమాలలు వేసిఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జ్ఞానం లేనందున నైతికత లేకుండా పోయింది, నైతికత లేనందున ఐక్యమత్యం లేనందున అణచి వేయబడ్డారని గ్రహించి అన్నింటికీఅనార్థాలు కేవలo అవిద్యే కారణమని . శూద్రులు, అతి శూద్రుల కోసం పాఠశాల ఏర్పాటు చేసి వి ద్యను అందించిన అక్షర జ్యోతి పూలే గారని ఆయన సేవలను కొనియాడారు. తన ఇంటిలో మంచినీటిబావిని తవ్వించి అందరికీ తాగునీరు అందించారు.పూణే నగరంలో శూద్రులు, అతి శూద్రుల మహా ర్యాలీని నిర్వహించిచైతన్య కార్యక్రమాలు చేపట్టారు. వితంతు వివాహాలను ప్రోత్సహి oచాడు. భారతదేశంలోస్త్రీల అందరికీ సమాన హక్కులు అందుబాటులోకి వచ్చే రోజు కోసం పూలే కలలుగన్నాడు,స్త్రీలు చదువుకుంటేనే సమసమాజ నిర్మాణం జరుగుతుందని ఆయన గట్టిగా నమ్మారు అని అన్నారు.ఈ విధంగాభారత దేశ గతిని మార్చిన వైతాళికుడు గా చరిత్రకెక్కారు. మహాత్మా పూలే సత్యశోధక్ సమాజాన్ని స్థాపించి అనేక రకాలుగా సమాజ మార్పుకు కృషి చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ సర్పంచ్కృష్ణ కుమార్, శంకర్, రామస్వామి, పాండు, రాజశేఖర్,రాజు,శ్రీకాంత్, గొడుగు నర్సింలు ఎడ్ల చెన్నయ్య, నాగరాజు, శ్రీనివాస్,రంగయ్య తదితరులు పాల్గొన్నారు