శెట్పల్లి అలేఖ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన కోదండరాం…-

సిరా న్యూస్, ఖానాపూర్:

శెట్పల్లి అలేఖ్య కుటుంబ సభ్యులను పరామర్శించిన కోదండరాం…-

ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని డిమాండ్..

నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని అంబెడ్కర్ నగర్ కాలనీకి చెందిన శెట్పల్లి అలేఖ్య ను ప్రేమ పేరిట వెంబడించి, నడిరోడ్డుపై అత్యంత దారుణంగా నరికి చంపిన నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేసి విచారణ చేపట్టాలని టీజేఎస్ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం డిమాండ్ చేశారు. ఆదివారం మధ్యాహ్నం అంబేద్కర్ నగర్లోని అలేఖ్య నివాసానికి వెళ్లి ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ సందర్భంగా అలేఖ్య హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. హంతకుడు చేసిన విచక్షణ రహిత దాడిలో తీవ్రంగా గాయపడిన మరో యువతీ జయశీల ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. అలేఖ్య హత్య కేసులో నిందితులు శ్రీకాంత్ సహ మరో ఇద్దరిని కఠినంగా శిక్షించాలనీ అన్నారు. జయశీల ఆరోగ్య పరిస్థితిపై ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఆమెకు భవిష్యత్తులో న్యాయం జరిగేలా తన వంతుగా సహకరిస్తానని హామీ ఇచ్చారు. హత్య జరిగిన తీరు, అలేఖ్య కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ప్రజాపంథా ఉమ్మడి జిల్లా కార్యదర్శి నందిరామయ్య కు ప్రొఫెసర్ కోదండరాం వివరించారు. ఆయన వెంట మానవ హక్కుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు భుజంగరావు, విద్యావంతుల వేదిక జిల్లా అధ్యక్షులు విజయకుమార్, టీజేఎస్ జిల్లా అధ్యక్షులు గనపత్రి తిలక్ రావు, తదితరులు ఉన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *