శ్రీధర్ బాబు గెలుపు కోరుతూ పలు గ్రామాల్లో కాంగ్రెస్ నాయకుల ప్రచారం

నవంబర్ 18 (సిరా న్యూస్)

మంథని

తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, ఏఐసీసీ సెక్రటరీ, ఎమ్మెల్యే అభ్యర్థి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గెలుపు కోరుతూ మంథని మండలంలోని ఆరెందా, వెంకటాపూర్, మల్లారం గ్రామాల్లో మంథని మండల కాంగ్రెస్ అధ్యక్షులు అయిలి ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి నూకల బాణయ్య, వైస్ ఎంపీపీ కొమ్మిడి స్వరూప్,యూత్ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఊట్ల అనిల్ రెడ్డి,జోడు రమేష్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ అభయహస్తం 6 గ్యారెంటీ పథకాలతో గ్రామాలలో గడపగడుపు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ సందర్బంలో గ్రామాల్లోని ప్రజలు కాళేశ్వరం ప్రాజెక్ట్ ద్వారా మా భూములు కోల్పోవడం ద్వారా తీవ్ర అన్యాయం జరిగిందని ప్రజలు కాంగ్రెస్ నాయకుల వద్ద వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తరువాత మాకు న్యాయం చేయాలనీ వేడుకున్నారు, శ్రీధర్ బాబు ని భారీ మెజారితో గెలిపించండని వచ్చే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అని వారికి భరోసా అందించారు.
ఈ కార్యక్రమంలో మండల వర్కింగ్ ప్రెసిడెంట్ బూడిద శంకర్, ఎంపీపీ కొండ శంకర్, జిల్లా సెక్రటరీ కుడుదుల వెంకన్న,బిసి సెల్ మండల అధ్యక్షులు ఐలి శ్రీనివాస్,మంథని సురేష్, డిఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు నూకల కమల్,యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు ఎరుకల ప్రవీణ్,ఎస్సి సెల్ డివిజన్ అధ్యక్షులు మంథని సత్యం,మండలం సోషల్ మీడియా ఇంచార్జ్ రేపాక శ్రీకాంత్,ఎస్సి సెల్ మండల అధ్యక్షులు మంథని రాకేష్,మైనారిటీ షేబ్బీర్ ఖాన్, మాజీ జడ్పీటిసి మూల సరోజన రెడ్డి, మాజీ మార్కేట్ కమిటీ చైర్మన్ అజీమ్ ఖాన్,సింగిల్ విండో డైరెక్టర్ రావికంటి సతీష్,మంథని టౌన్ అధ్యక్షులు పోలు శివ, టౌన్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు పెంటరి రాజు, మంథని కౌన్సిలర్స్ పెండ్రి రమ రెడ్డి, హనుమంత రావు,యూత్ కాంగ్రెస్ డివిజన్ సెక్రటరీ ఎరుకల రమేష్ బాబు, సర్పంచ్ చెన్నవేణి సదానందం, యూత్ కాంగ్రెస్ మండల సెక్రటరీ ఎరుకల సురేష్, గ్రామ శాఖ అధ్యక్షులు చంద్రు విజయ్
ఆరెందా గ్రామ శాఖ అధ్యక్షుడు, మాజి ఎంపీటీసీ సత్యనారాయణ రెడ్డి, బూత్ అధ్యక్షులు కొమ్మిడి నరేష్, మండల యూత్ సెక్రటరీ కొమ్మిడి సంతోష్, వార్డ్ మెంబెర్స్ లక్కీరెడ్డి స్వామి, ధరంపల్లి నిహారిక, రాజబాబు, రాతిపెల్లి మధుకర్ లతో పాటు కాంగ్రెస్ నాయకులు, యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *