కమాన్ పూర్,(సిరా న్యూస్);
మంథని ఎమ్మెల్యేగా శ్రీధర్ బాబును అత్యధిక మెజార్టీతో గెలిపిస్తామని కమాన్ పూర్ మండలం గుండారం గ్రామపంచాయతీ పరిధిలోని రాజాపూర్ యువకులు పేర్కొన్నారు. మంగళవారం సాయంత్రం సుమారు 50 మంది యువకులు కమాన్ పూర్ సింగల్ విండో చైర్మన్ ఇనగంటి భాస్కరరావు గుండారం సర్పంచ్ ఆకుల ఓదెలు నాయకులు సయ్యద్ అన్వర్ మాజి కో ఆప్షన్ సభ్యుడు అబ్దుల్ రఫీక్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరగా వారికి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పనులను ప్రజలకు వివరిస్తామని కాంగ్రెస్ గెలుపే ధ్యేయంగా పంచేసామని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ పిడుగు నరసయ్య నాయకులు జంగిల్ కనకయ్య అడబాల మల్లయ్య గోస్కుల కుమార్ ఇజ్జగిరి సదయ్య పిడుగు అర్జున్ సాజన్ అవునురి బాలు రంగం కనకయ్య స్వామి తదితరులు పాల్గొన్నారు.