సిరా న్యూస్, అవనిగడ్డ: ఉల్లిపాలెం శ్రీమన్నారాయణ స్వామి ఆలయంలో దొంగలు పడ్డారు. ఆలయంలోని ఆభరణలు అందినకాడికి దోచుకొని బీభత్సం సృష్టించారు. దొంగలు ఆలయ ప్రధాన ద్వారం తాళాలు పగలగొట్టి, రాజ్యలక్ష్మి, గోదాదేవి అమ్మవారి ఉపాలయాల్లో విలువైన బంగారు, వెండి ఆభరణాలు చోరీ చేసారు. అమ్మవార్ల పూజలకు వినియోగించే వెండి పాత్రలు, దేవేరుల మంగళ సూత్రాలను అపహరించినట్లు సమాచారం. ఈ మేరకు సమాచారం అందుకున్న కోడూరు పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, వివరాలు సేకరిస్తున్నారు.