సిరా న్యూస్, సైదాపూర్:
శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహా పునః ప్రతిష్ఠాపన వేడుకలకు తరలిరావాలి…
కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలం వెన్నంపల్లి గ్రామములో ఈ నెల 25, 26, 27 తేదీలలో నిర్వహించనున్న శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి విగ్రహా పునః ప్రతిష్ఠాపన వేడుకలకు భక్తులు అధిక సంఖ్యలో తరలిరావాలని ఆలయ కమిటీ సభ్యులు గ్రామస్తులు కోరుతున్నారు. పూర్వము ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయస్వామి దేవాలయంలో, శ్రీ శివ పంచాయతన సహిత ప్రసన్నాంజనేయస్వామి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవ కార్యక్రమములు నిర్వహించుటకు వేదమూర్తులైన బ్రాహ్మణోత్తములచే సుముహూర్తము నిశ్చయించినట్లు తెలిపారు. ఈ ప్రతిష్ఠ మహోత్సవ కార్యక్రమానికి భక్తులు సకుటుంబ సపరివార సమేతముగా విచ్చేయాలని కోరారు. ఈ మహోత్సవాన్ని తిలకించి భగవత్ కృపకు పాత్రులు కావాలని ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు కోరారు.