స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్మక్తల్,
(సిరా న్యూస్);
సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో సకల జనులకు సబ్బండ జాతులకు దశాబ్ది కాలం నుండి సంక్షేమ ఫలాలు అందించి వారిని అభివృద్ధి వైపు నడిపించిన ఘనత కేసిఆర్ ప్రభుత్వానికి దక్కుతుందని రాష్ట్ర స్పోర్ట్స్ పార్టీ చైర్మన్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ అన్నారు. మక్తల్ నియోజకవర్గం ఊట్కూర్ మండలంలోని పెద్ద జట్రం, పులిమామిడి,పాత పల్లి,బిజ్వార్, ఔషులోనిపల్లి, చిన్న పోర్ల, తిమ్మారెడ్డి పల్లి తండా, నిడుగుర్తి తండా,..వివిధ గ్రామాల రైతులతో సమావేశం అయినరాష్ట్ర స్పోర్ట్స్ అథారిటీ చైర్మన్,బిఆర్ఎస్ పార్టీ మక్తల్ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్జ్ డాక్టర్ ఆంజనేయ గౌడ్ ఈ సమావేశలలో డాక్టర్ ఆంజనేయ గౌడ్ మాట్లాడుతూ,భీమాలాంటి పెండింగ్ ప్రాజెక్ట్ ల పనులను పూర్తి చేయడంతో పాటు, నూతన ఎత్తి పోతల పథకాలు, రిజర్వాయర్లు నిర్మించి, పాలమూరు రంగారెడ్డి పనులు కూడ 95%పూర్తి చేసి,మిషన్ కాకతీయ ద్వారా చెరువులను బాగుచేసి ఉమ్మడి జిల్లాలో 15లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు. ఒక్క మక్తల్ నియోజకవర్గ పరిధిలోనే 2లక్షల ఎకరాలకు పైగా పంట పొలాలకు సాగునీరు అందించిన ఘనత కెసిఆర్ గారిదని ఆయన తెలిపారు.73లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం కోసం 85వేల కోట్లు అందించిన ఘనత కెసిఆర్ గారిదని ఈ పథకాన్ని దేశంలోని అన్ని రాష్ట్రాలు అనుసరించే విధంగా ఆలోచనలు చేస్తున్నాయని అన్నారు