సత్యశోధక వివాహానికి హాజరైన ప్రముఖులు…

సిరా న్యూస్, ఆదిలాబాద్:

సత్యశోధక వివాహానికి హాజరైన ప్రముఖులు...

అఖిల భారతీయ మాలీ మహా సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుకుమార్ పేట్కులే కుమార్తె సుహర్ష రాణి సత్యశోధక వివాహము చంద్రపూర్ జిల్లా రాజురకు చెందిన సామాజిక కార్యకర్త పుండలిక్ వాడాయి కుమారుడు లలిత్ తో ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని పద్మనాయక కళ్యాణ మండపంలో నిర్వహించారు. మహాత్మ జ్యోతిరావు ఫూలే, సావిత్రిబాయి పూలే దంపతులు 1873 వ సంవత్సరంలో సత్యశోధక సమాజాన్ని స్థాపించి సత్యశోధక సమాజ నియమాలకు అనుగుణంగా సత్య వివాహాలు జరిపించడం ప్రారంభించారు. ఇలాంటి వివాహాలు మహారాష్ట్రలో చాలా ప్రాచుర్యంలో ఉండగా, ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో మొట్టమొదటిసారిగా ఈ వివాహ వేడుక నిర్వహించారు. ఈ సందరు ముందుగా ఫూలే దంపతులతో పాటు బహుజన మహనీయుల చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పూణేకి చెందిన రఘునాథ్ డోక్ రాసిన సత్యశోధక వివాహ పద్ధతి పుస్తకాన్ని తెలుగులో సుకుమార్ పెట్కులే అనువదించగా దాన్ని ఆవిష్కరించారు. మహారాష్ట్రలోని నాగపూర్, పూణే, చంద్రపూర్, వణి, యవత్మాల్, పాండ్రకౌడ, అమరావతి, నాందేడ్, తదితర జిల్లాల నుండి వందలాదిమంది ఈ వివాహానికి హాజయ్యారు. దీనికి ముఖ్య అతిథులుగా మహారాష్ట్ర మాలి సంఘం రాష్ట్ర అధ్యక్షులు అడ్వకేట్ రాజేంద్ర మహాదోడే, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆదిలాబాద్ మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, తలమడుగు జడ్పిటిసి గోక గణేష్ రెడ్డి, తదితరులు పాల్గొని వధూవరులను ఆశీర్వదించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *